ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్టులో ఉభయ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సంఘటన సృజన్ అభియాన్ శిక్షణ కార్యక్రమ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూర్ నేతలు కలిశారు. ఈ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్, వార్డ్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన తదితర సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని సీఎం భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.