Take a fresh look at your lifestyle.

మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఆణిముత్యాల్లా వెలుగుతారు – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

 

 

 ముద్ర మల్కాజిగిరి 

 

మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు సమాజంలో ఆణిముత్యాల్లా వెలుగొందుతారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు

నేరెడ్‌మెట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ నాయకులు జే.కే. సాయి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  తన సతీమణి మమతా రాజశేఖర్ రెడ్డి తో కలిసి నియోజకవర్గ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పారిశుద్ధ్య కార్మికులు , డాక్టర్లు, టీచర్లు,సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న  తదితరుల సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల గొప్పతనాన్ని కొనియాడుతూ “కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజేషు మాత” అనే మాటలను ఉదహరించారు. కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. అలాగే తన సతీమణి మమతా రెడ్డి రాజకీయంగా, వ్యాపార పరంగా తనకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, సావిత్రిబాయి పూలే, ఇందిరా గాంధీ వంటి మహనీయ మహిళలను స్మరించుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, జీ.కే. హనుమంత్ రావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.