ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బుధవారం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన గంప భగీరథ అనే 102 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు స్థానిక గాంధీ నగర్ కు చెందిన భగీరథ తన కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేశారు.