Take a fresh look at your lifestyle.

మణికొండలో చలివేంద్రం ఏర్పాటు

 

ముద్ర మల్కాజిగిరి

స్వచ్ఛంద సేవా సంస్థ నవ సేవా సంకల్ప ఆధ్వర్యంలో మణికొండ భాగ్యలక్ష్మి కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద భక్తుల, పాదచారుల వేసవి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సంఘ సేవకుడు, సామాజికవేత్త మాదిరెడ్డి పెంటారెడ్డి ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటుచేస్తున్నామని నవసేవా సంకల్ప చైర్మన్ మణి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు తిప్పరాజు రమేష్ బాబు, దేవాలయ సభ్యుడు మల్లారెడ్డి, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, సినీ నటుడు శ్రీహరి, సర్దార్ పటేల్ పార్క్ వాక్ మేట్స్ సుగుణ రాజు, రేణికుంట భాస్కర్, విష్ణు, శ్రీనివాసరావు, హర్షా రెడ్డి, అజార్, మహేష్, సుధా రామకృష్ణ, హర్ష కుమార్, రవి, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.