Take a fresh look at your lifestyle.

సంక్షేమ సంఘ సభ్యత్వాల నమోదు

.
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాకిట అశోక్ కుమార్, మల్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ లో సంఘం సభ్యులు మొదటగా సభ్యత్వం తీసుకొని సభ్యత్వాల నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు తప్పనిసరి సభ్యులుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
సంఘం సభ్యత్వం పొందిన సభ్యులు ప్రతి ఒక్కరికీ సంఘం నుంచి సేవలు అందుతాయన్నారు. సభ్యత్వ రుసుము కింద రూ. వేయి చెల్లించి సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వారం రోజులపాటు ఇదే సమయానికి మెట్టుగడ్డ వద్ద ఉన్న సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ లో సంఘం సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
……………………………….

Leave A Reply

Your email address will not be published.