హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 21:
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని ఓ మొబైల్ షాపులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులోని విలువైన సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యింది.
ఘటన వివరాల్లోకి వెళితే:
వడ్డేపల్లి హరిబాబు అనే వ్యక్తి గత పదేళ్లుగా కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్‌లో ‘శ్రీ సాయి కమ్యూనికేషన్’ పేరుతో మొబైల్ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు యధావిధిగా వ్యాపారం ముగించుకుని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పద్మావతి ప్లాజా హోటల్ సిబ్బంది షాపు నుండి పొగలు రావడాన్ని గమనించి హరిబాబుకు సమాచారం అందించారు.
బాధితుడు అక్కడికి చేరుకునే సరికి షాపులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. షాపులోని కొత్త మొబైల్ ఫోన్లు
మొబైల్ యాక్సెసరీస్
కస్టమర్లు రిపేర్ కోసం ఇచ్చిన ఫోన్లు
ఖరీదైన ఫర్నిచర్
మొత్తం కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. బాధితుడు హరిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.