Take a fresh look at your lifestyle.

కొండగట్టు చిన్న జయంతి ఉత్సవాల సమీక్ష సమావేశం

  • జయంతి ఉత్సవాలకు సకల సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే

మల్యాల, ముద్ర : కొండగట్టు చిన్నహనుమాన్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని శుక్రవారం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే చిన్నహనుమాన్‌ జయంతి వేడుకల నిర్వహణకు ఎమ్మెల్యే, అడిషనల్ కలెక్టర్‌ బిఎస్ లతా, ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్ ల తో పాటు దేవస్థానం వివిధ జిల్లా స్థాయి అధికారులతో ఆలయ పరిసరాలను సమీక్షించారు. అనంతరం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జయంతికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి తీసుకోవల్సిన చర్యలన్నీ చేపట్టాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని, మెట్ల దారిలోనూ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కొండపైకి వచ్చే మార్గాల్లో చలివేంద్రాలు, వైద్య సదుపాయం, చలువ పందిళ్లు, విద్యుత్‌, నీటి సరఫరా వంటివి నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, డి ఆర్ డి ఓ, డీఎస్పీ రఘు చందర్, సీఐ నీలం రవి, ఎస్సై నరేష్, ఆలయ అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, ముత్యం శంకర్, మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, నేరెళ్ల సతీష్ రెడ్డి, తాళ్ల హరినాథ్, కొరేపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.