- ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
- PHC హెల్త్ అసిస్టెంట్లు
ముద్ర,పానుగల్: పానుగల్ మండలంలోని వివిధ గ్రామాలలో మిషన్ మధుమేహ సర్వే కొనసాగుతుంది.మండలంలోని కేతేపల్లి గ్రామంలో మిషన్ మదుమేహ సర్వే సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామయ్య ,PHC హెల్త్ అసిస్టెంట్ రాంచందర్ లు గ్రామంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించారు.30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలనీ,వ్యాధినిర్ధారణ అయినచో జీవన శైలిలో మార్పులు చేసుకొని ఆహారపు అలవాట్లు మార్చుకొని నిత్యము నడక,యోగ ,సమయానికి నిద్రించాలన్నారు.వైద్యులు సూచించిన విధంగా మందులు వాడితే వ్యాధి అదుపులో ఉంటుందన్నారు.కార్యక్రమం ANM శ్రీలక్ష్మి, ఆశ కార్యకర్తలు,గ్రామస్థులు పాల్గొన్నారు.