Take a fresh look at your lifestyle.

శ్రవణ నక్షత్ర కళ్యాణం ఘనంగా నిర్వహించారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోవింద క్షేత్రం, హౌసింగ్ బోర్డ్ కాలనీ

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

ఈ రోజు స్వామివారి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని, గోవింద క్షేత్రంలోని లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాస కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తజనులు, కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు, ధూప దీప నైవేద్య యజమానులు మరియు స్థిర స్థాయి సభ్యులు భారీగా పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.
అనంతరం మంగళహారతి నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ ఆచార్యులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.