చరిత్రలో గొప్ప విజయం..
మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురిలో 15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..
ఖాతా తెరవని బీఆర్ఎస్ బీజేపీ..
మాజీ మంత్రి కొప్పుల కు ఘోర పరాభవం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత స్పెషల్ అట్రాక్షన్ గా మంత్రి అడ్డూరి..

ధర్మపురి:
మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 15 స్థానాలు గాను 15 స్థానాల్లో గెలిపించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కనీసం ఖాతా ఓపెన్ చేయలేదు. ఎన్నికల్లో ధర్మపురి లో అన్ని తానే బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర పరాభవం ఎదురైంది. మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పటికీ అవి ఏమి పట్టించుకోని ఓటర్లు వినూత్న తీర్పునిచ్చి 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి లో 15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చరిత్రలో గొప్ప విజయం గా భావించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ..
గడచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాత్రి పగలు కష్టపడి అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ఆరు నెలల లోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి అడ్లూరి హితవు పలికారు.
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసినప్పటికీ అవి సత్యదూరమని భావించిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మంత్రి అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన రెండు సంవత్సరాలుగా విద్య, వైద్యం ఆరోగ్యం వంటి అంశాలతో పాటు రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన విజయతీరాలకు చేర్చిందని మంత్రి అడ్లూరి అన్నారు.
మున్సిపల్ ఎన్నికలు ఫలితాలతో పొంగిపోకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రానున్న మూడు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.