Take a fresh look at your lifestyle.

కాలని అభివృద్ధికి కృషిచేస్తా

ముద్ర ప్రతినిధి, హనుమకొండ: హనుమకొండ పట్టణ పరిధిలోని 56 వ డివిజన్ వివేక నగర్ కాలని అభివృద్ధికి కృషి చేస్తానని సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగంపల్లి వేణుగోపాల్ రావు అన్నారు.మంగళవారం కాలనికి చెందిన 100మంది. సభ్యులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యల పై చర్చించారు.వాటి పరిష్కార దిశగా అందరూ కలసి కమిటీని ఏర్పాటు చేసారు అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొప్ప శివ శంకర్, వైస్ ప్రెసిడెంట్ దార బోయిన ప్రణయ దీప్, ప్రధాన కార్యదర్శి బుర్ర విజయపాల్, కోశాధికారి డా. రాచర్ల గణపతి నీ రెండు సంవత్సరాల కాల పరిమితితో ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.