Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే తెలపండి -ఆడే గజేందర్

 

బోథ్, ముద్ర:

రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం ఆయన  నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వం ఇల్లు లేని  పేదలకు ఇళ్లు నిర్మించడం ముఖ్య లక్ష్యమని అన్నారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి కావడానికి  అవసరమైన అన్ని  చర్యలు  తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన నివాసం కల్పించడం జరుగుతుందని, ప్రతి అర్హుడికి ఇల్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,  గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.