Take a fresh look at your lifestyle.

నేర నియంత్రణకు సీసీ కెమెరాలది కీలక పాత్ర 

 

 ముద్ర : కాప్రా 

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పాటునందిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో సమానమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

కాప్రా మజిద్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రాంతంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అవసరమని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో   మైనార్టీ నాయకులు బద్రుద్దిన్ మైనార్టీ నాయకులు తాజుద్దీన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.