Take a fresh look at your lifestyle.

వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

 

 

ముద్ర,‌గద్వాల:

ధరూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లోని స్థానిక హనుమాన్ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహానికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాద స్వీకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ధరూర్ గ్రామంలో శ్రీపార్థసారథి దేవాలయం నుండి హనుమాన్ శోభా యాత్ర నిర్వహించారు‌‌. ఈ శోభాయాత్రలో ధరూర్ సర్పంచ్ డీఅర్ విజయ్, టీయుడబ్ల్యూజె ఐజేయు రాష్ట్ర నాయకులు ధరూర్ శ్యామ్, మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పద్మా వేంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనను తిలకించారు.


 

 

Leave A Reply

Your email address will not be published.