Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటా

  • కుటుంబంలా కలిసి పనిచేయడంతోనే నిరంతరంగా విద్యుత్ సరఫరా.
  • మనం అందరం ఒకటే అన్న భావన కలిగించడానికి లైన్మెన్ నుంచి సీఎండీ వరకు యూనిఫామ్ తీసుకురావాలని ఆలోచన.
  • విద్యుత్ సిబ్బందికి నిఫ్టుతో డిజైన్ చేయించి డ్రెస్సులు ఇస్తాం.
  • మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.
  • విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది ఇంట్రాక్షన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యుత్తు డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్తును సరఫరా చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ఈ మహాకార్యంలో అకుంఠిత దీక్ష, నిబద్ధతతో సిబ్బంది పని చేయడంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.సోమవారం రాత్రి హైదరాబాద్ ప్రజాభవన్ లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బందితో భట్టి విక్రమార్క ఇంట్రాక్షన్ అయ్యారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానఅన్నారు.పీడీసేఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ,ట్రాన్స్ కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు ఉండదని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు లాగా ఈ ఏడాది మార్చి లో 17,162 మెగావాట్లకు పైగా పిక్ డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం కూడా కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా  చేసి వారి విమర్శలను తిప్పి కొట్టిన విద్యుత్తు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉన్నత స్థాయిలో నేను,  యజమాన్యాలు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని  క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మీ సేవలను గుర్తించి అభినందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు.రాష్ట్రంలో ఉన్న విద్యుత్తు సంస్థలను బలోపేతం చేసుకుని క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్తు ను సరఫరా చేసే స్థాయికి ఎదగడానికి అధికారులతో సహా క్షేత్రస్థాయి సిబ్బంది అకుంఠిత దీక్ష, నిబద్ధతతో పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు.ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బందిని ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ ప్రోత్సహిస్తుందని అందులో భాగంగానే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల సమస్యను అధికారులంలోకి రాగానే పరిష్కరించి వేల మందికి పదోన్నతులు కల్పించామన్నారు.మనందరం ఒకటే అన్న భావన కల్పించేందుకు డిస్కం కంపెనీలో పనిచేస్తున్న లైన్మెన్ నుంచి సీఎండి వరకు ఒకే తరహా యూనిఫాం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు అదే విధంగా నిఫ్టు తో డిజైన్ చేయించి విద్యుత్ సిబ్బందికి డ్రెస్సులు ఇస్తామని ప్రకటించారు.నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాది కాదని, ప్రతి ఆలోచన అందరితో పంచుకుంటామని, అందరి ఆలోచనలు తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మనదన్నారు.

విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు ఏవి ఉన్న ప్రజా ప్రభుత్వం స్పందిస్తుంది, పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. యజమాన్యం తో పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని విద్యుత్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. సంపద సృష్టించే ప్రధాన రంగాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు.రీజినల్ రింగ్ రోడ్, మూసి పునర్జీవం ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో త్వరితగతిన అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో తెలంగాణ నమోదు కానుంది అన్నారు.రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విస్తరణతో పాటు డేటా సెంటర్స్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు కావలసిన విద్యుత్తు గురించి ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నామని వివరించారు.న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతో రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు.విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వచ్చే అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నామని వివరించారు.థర్మల్, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి  రాజస్థాన్ ప్రభుత్వంతోనూ,  హైడల్ పవర్ ఉత్పత్తి చేయడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలతో ఎం ఓ యు చేసుకున్నామని వివరించారు.విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న మీరందరూ గర్వపడే విధంగా విద్యుత్ రంగ సంస్థలను ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.