ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలో జగిత్యాల మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చెందిన విద్యార్థిని సిల్వర్ మెడల్ సాధించింది.మానస స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గోనెల అక్షయ కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ ఇన్విటేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ – 2025 పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరచి సిల్వర్ మెడల్ సాధించింది.కటా,కుమిటే, వెపన్ కేటగిరీలో తన ప్రతిభను చాటుకొని అగ్రస్థానంలో నిలిచింది.పాఠశాల ప్రిన్సిపల్ రజిత రావు మాట్లాడుతూ అక్షయ కఠినమైన శ్రమ,నిబద్ధత, పాఠశాల మార్గదర్శనం,తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ విజయాన్ని సాధించగలిగిందని,ఆమె విజయంతో పాఠశాలకు గొప్ప గౌరవం వచ్చిందన్నారు.మానస విద్యార్థులు కేవలం పాఠశాల విద్యలోనే కాకుండా క్రీడలు, కళలు,ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని,విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే దిశగా మేం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఈ సందర్భంగా అక్షయను పాఠశాల డైరెక్టర్ లు శ్రీధర్ రావు,హరిచరన్ రావు,మౌనిక రావులు అభినందించారు.