ముద్ర, మెహదీపట్నం: మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది.
అర్చకులు కేశవమూర్తి పంతులు, రాజేష్ పండిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతాజీ నగర్, శ్రీనివాస్ నగర్ మారుతి నగర్, జ్యోతి నగర్ కాలనీలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.