కోరుట్ల/మెట్పల్లి, ముద్ర విలేకరి: మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామస్తులు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారంటూ బుధవారం రోజు ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు. వివరాలోకెల్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 619 గల 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో పెద్దాపూర్ గ్రామంలోని పూర్వీకుల నుండి పాడి పశువుల కోసం, చెట్ల పెంపకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని వేల చెట్లు నాటడం జరిగింది. అందులో 5 ఎకరాల భూమిని పొన్నం తిరుపతి గౌడ్ అక్రమంగా కబ్జా చేసి దున్నడం జరిగింది. దీనిని గ్రామస్తులందరూ ముక్తకంఠంతో ఖండిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురిచేసిన తిరుపతి గౌడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గ్రామ ప్రజలు కోరడం జరిగింది.