Take a fresh look at your lifestyle.

అభివృద్ధి లో వెంకటపూర్ గ్రామం అందరికి ఆదర్శం-ఎమ్మెల్యే హరీశ్ రావు

 

– నంగునూర్ మండలం వెంకటా పూర్ గ్రామం లోని హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

వెంకటాపూర్ గ్రామం మొదటి నుంచి కూడా చాలా మంచి గ్రామం ఇక్కడ అందరు రైతులు మహిళలు చాలా అద్భుతంగా కష్టపడి బ్రహ్మాండమైన పంటలు పండిస్తూ సిద్దిపేట నియోజకవర్గానికే వెంకటాపూర్ గ్రామం ఎంతో ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వెంకటాపూర్ గ్రామం నుంచి హైదరాబాద్ కు లారీలలో కూరగాయలు పంపిస్తూ ఉంటారని సంతోషం వ్యక్తం చేశారు… సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపుర్ గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవాల్లో అయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, అయితే ఆ రోజుల్లో ఈ దేవాలయానికి తాను కూడా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని చెప్పారు. ఆనాడు ఆర్థిక సహాయం అందించారని నేడు మా అక్క చెల్లెలు ఆంజనేయస్వామికి కిరీటాన్ని చేయించాలని తనను అడగడం జరిగిందని అన్నారు. అక్క చెల్లెళ్ల కోరిక మేరకు వచ్చే ద్వితీయ వార్షికోత్సవం వరకు ఆంజనేయస్వామికి కిరీటాన్ని చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. వెంకటాపుర్ గ్రామం లాగే మంచి పంటలు పండించి ఆర్థికంగా ఎదుగాలని ఏ ఊరికి వెళ్లిన చెబుతుంటానని గుర్తు చేశారు. స్వామి దయతో ఇంకా రైతులు మంచిగా ఉండాలని ప్రజలు బాగుండాలని పిల్లలకు మంచి చదువు రావాలని ఆ ఆంజనేయ స్వామి వారిని వేడుకోవడం జరిగిందని అన్నారు. గతంలో వెంకటాపూర్ లో కొన్ని భూములు మురంబాద్ పేరు మీద ఉండేవి అని, గత బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు ప్రారంభ దశలో సుమారు 500 ఎకరాలకు రైతు బంధు పడలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని గుర్తు చేశారు. మురంబాద్ అనే గ్రామం పేరు ఎక్కడా కూడా ఆన్ లైన్ కాలేదని, రైతులకు పాస్ బుక్కులు కూడా లేకపోవడంతో రైతు బంధుకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఆ సమయంలో తాను ఒక ఏడాది కష్టపడి ఆ భూములన్నీ ఆన్లైన్ చేయించి రైతులకు రైతు బంధు అందేలా కృషి చేశానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.