బోథ్, ముద్ర:
జొన్నల కొనుగోలు సెంటర్ లను పెంచాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి కోరారు. మంగళ వారం ఆయన హైదరాబాద్ లో మంత్రిని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెల్ల జొన్నలు విస్తారంగా సాగు చేసిన నేపథ్యంలో అంచనాలకు మించి దిగుబడి వచ్చినందున ప్రభుత్వం ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను పెంచాలని కోరారు. వెంటనే స్పందించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కి కొనుగోలు సెంటర్ల పెంపుకై ఆదేశాలు జారీ చేస్తూ, ఒక ఎకరానికి 20 క్వింటాళ్లు తీసుకునే విషయం ముఖ్య మంత్రి, వ్యవసాయ, ఆర్థిక శాఖాల మంత్రులతో మాట్లాడి గత ఏడాది కంటే ఎక్కువ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారనీ పనుల చంటి ఒక ప్రకటనలో తెలిపారు.