Take a fresh look at your lifestyle.

స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే కు వినతి

 

బోథ్, ముద్ర: మండలంలోని కౌఠ (బి) గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గల  అంతర్ రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ మహారాష్ట్రాలను అనుసంధానించే ఈ అంతర్ రాష్ట్ర  రహదారి గుండా  నిత్యం వందల  సంఖ్యలో వాహనాలు రాకపోకలను కొనసాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఈ రహదారి పక్కనే  ప్రభుత్వ వసతి గృహం, దేవాలయాలు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై  స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల వాహనాల వేగం కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో   పలు మార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే స్వామి వివేకానంద యూత్ సభ్యులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పలితం లేకుండా పోయింది. తాజాగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్  దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే  గ్రామంలోని బస్ స్టాండ్ సమీపంలో  స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి స్వామి ఉప సర్పంచ్ రమణారెడ్డి యూత్ సభ్యులు అరవింద్ కుమార్,ప్రవీణ్, రాజు,ప్రశాంత్,హరిప్రసాద్,అబ్దుల్ రాహుఫ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.