Take a fresh look at your lifestyle.

మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి,జగిత్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, కొడిమ్యాల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ పొయ్యిపైనే చేయాలని, ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.కిచెన్ గార్డెన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. పాఠశాలలోని తొమ్మిదవ తరగతి హిందీ సబ్జెక్టును ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానంను విద్యార్థులతో కూర్చొని పరిశీలించారు.అనంతరం మండలం అర్హులైన వారి ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి వేగవంతంగా బేస్మెంట్ లెవెల్ చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డి ఈ ఓ రామ్, ఎంపీడీవో స్వరూప, ఎమ్మార్వో కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.