ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెందిన 102 మంది లబ్దిదారులకు రూ. 25.86 లక్షల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.