Take a fresh look at your lifestyle.

​ఉర్దూ మీడియంలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం టీ-షర్టుల పంపిణీ


మహాదేవపూర్,ముద్ర:

ఉర్దూ మీడియం ఉన్నత ప్రాథమిక పాఠశాల సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం మరియు విద్యార్థులకు ఉచిత టీ-షర్టుల పంపిణీ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు గౌరీవేణి మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి పురుషోత్తం రెడ్డి తమ మాతృమూర్తి జ్ఞాపకార్థం రెండు పాఠశాలల విద్యార్థులకు ఏకరూప టీ-షర్టులను వితరణగా అందజేశారు. ఈ టీ-షర్టులను గ్రామ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్షాద్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ సేవా నిరతిని అతిథులు మరియు ఉపాధ్యాయ బృందం కొనియాడారు. జడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాల సైన్స్ ల్యాబ్‌ను సర్పంచ్ మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంయుక్తంగా ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.