Take a fresh look at your lifestyle.

ప్రజల శ్రేయస్సును కోరే నాయకుడిపై కేసు పెట్టించడం దుర్మార్గం .వీరారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పురుషోత్తం

ముద్ర, తాండూర్ ప్రతినిధి:
తాండూర్ శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల శ్రేయస్సును కోరే నాయకుడు గా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడని వీరా రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి గుర్తు చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నాయకుడి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడం కోసమే బిఆర్ఎస్ నాయకులు చేసిన కుట్రలో భాగమే ఎమ్మెల్యే పై చేసిన కేసులని గుర్తు చేశారు. మచ్చలేని నాయకుడిపై ఎలాగైనా బురద జల్లేందుకే బలవంతంగా వత్తిడి చేసి పోలీసులతో కేసు పెట్టించారని వీరా రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి విమర్శించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఫలితాలు ప్రకటించిన తర్వాతనే విజయం సాధించిన కౌన్సిలర్లను పలకరించడానికి కౌంటింగ్ ప్రాంగణంలోని విలేకరులు ఉన్న స్థానానికి వెళితే ఓర్వలేకనే కేసులు పెట్టించారని గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.