దేశ రాజధాని చుట్టూత నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సి ఆర్) లోని కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు ర్యాలీ
బిజెపి ప్రభుత్వాల, పరిశ్రమల యాజమాన్యాల నిర్బంధాన్ని ఆపాలి – కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
దేశ రాజధాని ఢిల్లీ నగరం చుట్టూత నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సి ఆర్) లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు కనీస వేతనాలు చెల్లించాలని, పనిగంటలు తగ్గించాలని, ఇతర చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న పోరాటంపై పరిశ్రమల యాజమాన్యాలు ఆయా రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న నిర్బంధాన్ని ఆపాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా వర్క్ షాప్ అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అనంతరం నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు 8000/-, 9000/- తక్కువ వేతనాలతో ఇస్తూ, రోజుకు 12-13 గంటలు పని చేయిస్తూ యాజమాన్యాలు చట్ట ప్రకారం అమలు చేయాల్సిన సౌకర్యాలను కూడా అమలు చేయకపోవడంతో కార్మికులు చేస్తున్న సమ్మెను పరిష్కరించకపోగా వారిని అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ సమ్మెను అణిచి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. పోరాటంలో ఉన్న కార్మికులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ జైల్లో సుమారు 400 మందిని నిర్బంధించారని అన్నారు.

భేషరతుగా జైల్లో ఉన్న కార్మికులందరినీ విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎండి పాషా, తుర్కపల్లి సురేందర్, మాయ కృష్ణ, గొరిగే సోములు, సిలువేరు రామకుమారి, చెక్క రమేష్, సుబ్బూరు సత్యనారాయణ, బూరుగు సప్న, పుష్ప, సిహెచ్ శ్రీనివాస్, జన్ని జంగయ్య, చీమకండ్ల శ్రీరాములు, గంధమల్ల మాతయ్య, మంచాల మధు, పోతరాజు జహంగీర్, సయ్యద్ ఉమర్, బండారు శ్రవణ్, వడ్డేపల్లి యాదగిరి, ఎస్కే శ్రీను, అప్పం సురేందర్, పలుగుల మునీశ్వర్ రెడ్డి, జమ్ము రాజశేఖర్, బాల్ద సిద్ధులు, తూటి వెంకటేశం పాల్గొన్నారు.