రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని : తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నూతన ఆసుపత్రి భవనమునకు 40 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా రామన్నపేట మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ” నిరవధిక నిరాహార దీక్షలు ” చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేష్ , మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరేళ్ల నరసింహ చారి, కందుల హన్మంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, నాగాటి ఉపేందర్, వేముల సైదులు, శానకొండ రామును కలిసి సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు.