ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డి పి ఆర్ ఓ యు.అరుంధతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు శాలువా కప్పి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ మహిళా జిల్లా అధికారినిగా టియుడబ్ల్యూ జే (ఐ జే యు) ఆధ్వర్యంలో సన్మానించి గౌరవించినందుకు యూనియన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు యంబ నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఐజేయు కౌన్సిల్ మెంబర్ జీవి.శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్, యూనియన్ జిల్లా మాజీ అధ్యక్షులు జి. కృష్ణారెడ్డి, యూనియన్ నాయకులు కందుకూరు సోమయ్య, పురుగుల మల్లేశం, గుండు ప్రసాద్, తాళ్ల భాస్కర్ పాల్గొన్నారు.