సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు తెలంగాణ జన సమితి చేసిన పోరాటాలు ప్రయత్నాల మూలంగా ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే ఆర్డినెన్స్ సాధించుకోగలిగామని ఇది ప్రజా విజయమని ధర్మార్జున్ అన్నారు. తెలంగాణ సాధించుకుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అడుగులు పడతాయని జయశంకర్ సార్ నాడు తాను చెప్పినట్టుగానే ఈరోజు అడుగుల దిశ మొదలైందని అన్నారు. గత పది ఏళ్ల కాలంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి బిఆర్ఎస్ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచింది అని 32 శాతం రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గించి బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసింది అని విమర్శించారు. ఈ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాహసో పేతమైనది ఈ సాహసోపేత నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి అభినందిస్తుంది అన్నారు.. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా అమలులోకి తీసుకురావాలని తెలంగాణ జన సమితి కోరుతుంది అన్నారు.