Take a fresh look at your lifestyle.

డాక్టర్ల నిర్వార్ధ సేవలు వెలకట్టలేనివి

ముద్ర, రాయికల్ విలేఖరి : తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి, డాక్టర్ సురేందర్, డాక్టర్ అనిల్, డాక్టర్ సృజన, డాక్టర్ ఉదయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ బెక్కం తిరుపతి, ఆర్.ఎం.పి మండలోజు శ్రీనివాస్ లను సాల్వాల, మెమెంటో తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం నూతన లయన్స్ క్లబ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జెండా ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే, చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా రాయికల్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగస్తులను, చార్టెడ్ అకౌంటెంట్లను శాల్వా,మెమెంటో తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్, ప్రధాన కార్యదర్శి బొడగం అంజిరెడ్డి రెడ్డి, కోశాధికారి బెక్కం తిరుపతి, ఉపాధ్యక్షులు వాసం స్వామి, మాజీ జడ్ సీలు బత్తినిభూమయ్య, మ్యాకల రమేష్,కాటిపెళ్లి రామ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,కొమ్ముల ఆదిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్, కటుకం కళ్యాణ్, నిమ్మల వెంకట్ రెడ్డి, కట్ల నర్సయ్య, కనపర్తి శ్రీనివాస్, జిల్లాల సూర్యం, మోర రామ్మూర్తి, బాలె నిఖిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.