Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్టు 25 లక్షల రూపాయల విలువచేసే ఎన్ డి ఎం ఏ డ్రగ్స్ స్వాధీనం

 

 

ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్:

విద్యార్థి వీసాల పేరుతో దేశానికి వచ్చి, డ్రగ్స్ అమ్ముతున్న వేరు వేరు దేశాలకు చెందిన ఇద్దరు విదేశీయులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 25 లక్షలు రూపాయలు విలువ చేసే ఎం డి ఎం ఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం…. యమన్ దేశానికి చెందిన అల్ ఆక్వార్ అబ్దురాబు 2008 సంవత్సరంలో పర్యాటక వీసాతో భారతదేశానికి మొదటిసారి వచ్చాడు. ఆ తర్వాత విద్యార్థి వీసా తో 2009, 2011,2012 లలో మళ్లీ వచ్చి 2015, 2016 లో వీసా గడువు 16 ఏప్రిల్ 2020 వరకు పొడిగించుకున్నాడు. కర్ణాటక హైదరాబాద్లలో జేఎన్టీయూలో కూడా విద్య కోసం చేరి మధ్యలోనే చదువులు మానేశాడు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ అతను ఇక్కడే డ్రగ్స్ అన్ని సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని డ్రగ్స్ సరఫరా చేస్తూ పలుమార్లు బెంగళూరు, హైదరాబాద్లలో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలో పాలస్తినా దేశానికి చెందిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేయబడిన అలీ మొహమ్మద్ అల్ కఫ్రి ద్వారా డ్రగ్స్ సప్లయర్ నైజీరియన్ చిడి ని పరిచయం చేసుకున్నాడు. అతనికి నగరంలో 8 నెలలు ఆశ్రయం కూడా ఇవ్వగా చిడి ని 8 జనవరి 2026 లో టోలిచౌకి పోలీసుల సాయంతో నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం మరో నైజీరియన్ ద్వారా బెంగళూరులో అబ్దురాబు కి గాజా కు చెందిన హసన్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. హసన్ 2016లో మొదటి సారి భారతదేశానికి వచ్చి కర్ణాటక కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ కళాశాలలో బీసీఏ కోర్సులో చేరాడు. కోవిడ్ సమయంలో వెళ్లిపోయిన అతను టర్కీ నుండి ఆన్లైన్లో తన కోర్సు పూర్తి చేశాడు. 2022లో బిజినెస్ విషయతో మళ్ళీ దేశానికి రాగా నవంబర్లో ఎలంక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 2024 నుండి ఇతను లూడో గేమ్ కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తున్నాడు. బెంగళూరులో అబ్దురాబు, హాసన్ లు కలిసి డ్రగ్స్ విక్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాంచ్ లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, మాదకద్రవ్యాలు నివారణ సంస్థ సంయుక్తంగా అబ్దురాబు, హసన్ లను అరెస్టు చేశారు. విరువదనుండి 25 లక్షల రూపాయల విలువ చేసే 150 గ్రాముల ఎం డి ఎం ఏ డ్రగ్స్ సీజ్ చేశారు. విద్యార్థుల వీసా పేరుతో వచ్చిన వీరిపై పలు డ్రగ్స్ కేసులు ఉండగా, హసన్ ఏడు నెలల జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చారన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Leave A Reply

Your email address will not be published.