- దేశంలో తాజా పరిస్థితులు.
- తెలంగాణలో భద్రతా చర్యలపై చర్చ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. సోమవారం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, తెలంగాణలో భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పెండింగ్ పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగానూ ఉత్కంఠగా మారింది.
