Take a fresh look at your lifestyle.

ఐదు మున్సిపాలిటీల్లో 812 నామినేషన్లు దాఖలు

ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో శుక్రవారం సాయంత్రం నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి 812 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీలో మొత్తం 80 వార్డులు ఉండగా 291 మంది అభ్యర్థులు 812 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. అమరచింతలో పది వార్డులకు 47 మంది 97 నామినేషన్లు, ఆత్మకూరులో 10 వార్డులకు 51 మంది 103 నామినేషన్లు, కొత్తకోట మున్సిపాలిటీలు 15 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు 123 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 31 మంది 104 నామినేషన్లు, వనపర్తి మునిసిపాలిటీలో 33 వార్డులకు గాను 113 మంది 385 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.