Take a fresh look at your lifestyle.

భాజా భజంత్రీలతో నామినేషన్లు

చివరి రోజు హోరెత్తిన దరఖాస్తులు
ముగిసిన నామినేషన్ల పర్వం
ముద్ర, వనపర్తి:
వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి పెబ్బేరు కొత్తకోట ఆత్మకూరు అమరచింత మున్సిపాలిటీలో జరిగిన నామినేషన్లు చివరి రోజు అయిన శుక్రవారం అట్టహాసంగా ముగిసింది.


వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలో నామినేషన్ల జాతర కొనసాగింది. పురపాలక సంఘం ఎన్నికలలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ తమ మద్దతుదారులతో నామినేషన్ల దాఖలుకు తరలి రావడంతో పట్టణ వీధులు హోరెత్తాయి. ఆయా పార్టీల జెండాలతో మద్దతుదారులు పెద్ద ఎత్తున అభ్యర్థుల వెంట తరలి రావడంతో పుర వీధులు హోరెత్తాయి. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు పట్టణంలోని పలు దేవాలయాలలో పూజలు నిర్వహించి ఆయా వార్డు కాలనీలలోని ప్రధాన కూడళ్ళ నుంచి మద్దతుదారులతో కదిలి వచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి, కమ్యూనిస్టు తదితర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు చెందిన మద్దతుదారులు, బంధు, మిత్రుల కలిసి రావడంతో ప్రధాన రహదారులు కిట కిటలాడాయి. అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో హోరెత్తాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి రోజు అయిన శుక్రవారం సాయంత్రం 5గంటలు కాగా చివరి నిమిషం వరకు వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డుల నుండి పురుషులు, మహిళా అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మున్సిపాలిటీలో ఎస్టీ లకు రెండు, ఎస్సి లకు మూడు, బీసీ లకు 11,జనరల్ మహిళ లకు 9,అన్ రైజర్వు ఎనిమిది వార్డుల కేటాయించిన విషయం తెలిసిందే. 16వార్డులు మహిళ లకు కేటాయించడం తో వారికీ మద్దతుగా మహిళలు నామినేషల ఘట్టంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.