- సీసీఎల్ ఏ మార్గదర్శకాలపై అభ్యర్థులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచన.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: గ్రామ పాలన అధికారి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సీఎస్ఎల్‌ఏ మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.పరీక్షకు సంబంధించి అభ్యర్థులు అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలను చేశారు.ప్రతి అభ్యర్థి తన హాల్ టికెట్‌ను ముందుగా డౌన్లోడ్ చేసుకుని, అందులో ఉన్న వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించాలని సూచించారు.. అలాగే, పరీక్ష కేంద్రం చిరునామాను ముందుగానే అభ్యర్థులు గుర్తించుకోవాలని తెలిపారు.అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని తెలిపారు. వాటిలో ఒకదాన్ని నియంత్రణాధికారి సంతకం చేసి హాల్ టికెట్‌పై అంటించాలని సూచించారు. మరో ఫోటోను పరీక్ష గదిలో పర్యవేక్షకునికి అప్పగించాలని తెలిపారు. మొబైలు ఫోన్లు, డిజిటల్ వాచీలు, పెన్‌డ్రైవ్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష హాలులో నిషేధించబడ్డాయని, ఇటువంటి వస్తువులు తీసుకురావద్దని అభ్యర్థులకు సూచించారు. బ్లూ లేదా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలని. జెల్ పెన్‌ను ఉపయోగించవద్దని కలెక్టర్ సూచించారు. పరీక్ష గదిలో అభ్యర్థులు నిశ్శబ్దంగా ఉండాలని, పర్యవేక్షకుల సూచనలకు పూర్తిగా సహకరించాలని కోరారు. పరీక్ష హాలులో నియమావళికి విరుధంగా ప్రవర్తించిన వారి పట్ల చట్ట రిత్యా చర్య తప్పవని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి సమయానికి రావాలని,అభ్యర్థులు ఉదయం 10:00 గంటల లోపు పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు పరీక్ష హాలులోకి అనుమతించరని స్పష్టం చేశారు. ఎంప్లాయ్ గుర్తింపు కార్డ్ మరియు ఆధార కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుభాభినందనలు తెలిపారు.