Take a fresh look at your lifestyle.

పంచాయతీ కార్యదర్శుల జిల్లా కమిటీ ఎన్నిక

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా కమిటీ ఎన్నికలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు బలరాం సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సభా వెంకటేశ్, కోశాధికారిగా రమేశ్ బాబు ఎన్నికయ్యారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సంఘ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు, టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.