మంథని, ముద్ర విలేఖరి: మాజీ ప్రధాని, బహు భాషా కోవిదులు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా శనివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలీ ప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, శశిభూషణ్ కాచే పాల్గొన్నారు.