Take a fresh look at your lifestyle.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఎస్ ఎస్సీ టాపర్లకు సన్మానం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎస్ ఎస్ సి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయి టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను, వారి తల్లితండ్రులను ప్రిన్సిపాల్ జ్యోతి, కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి సన్మానించారు. ఎర్రోజు కీర్తన 580 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలువగా, మహేష్ కుమార్ 560, కొండ హాని 541, చిలుక శివాని 536 మార్కులు సాధించిగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటశాల యాజమాన్యం విద్యార్థులు, పేరెంట్స్,ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.