-ముద్ర మోత్కూర్:
మండలంలోని దాచారం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం నెలకొంది. గ్రామ యువత సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశము ను వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై నిలదీశారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యత లోపం ఏర్పడిందని సీసీ రోడ్ల కాంట్రాక్టర్ ఎవరు తమకు తెలుపాలని గ్రామ యువత కోరారు. గ్రామపంచాయతీలో ఎలాంటి తీర్మానం లేకుండా సర్పంచ్ ఏకపక్షంగా వ్యవహరించి సీసీ రోడ్లు వేయించారని అవి నాణ్యత లోపించిందని యువత ఆరోపించారు. గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా గ్రామ సిబ్బందితో సిసి రోడ్లకు నీటిని సప్లై చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పి జనార్దన్ రెడ్డి ఆర్ బ్ల్యూ ఎస్ డీ ఈ పద్మావతి, జిపిఓ మందుల ఐలయ్య, పంచాయతీ కార్యదర్శి బి యాదగిరి, సంఘ బంధం అధ్యక్షురాలు ఖమ్మంపాటి రేణుక, అంగన్వాడి చింతల నర్మద, గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉండాటి కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు