Take a fresh look at your lifestyle.

పల్లెలకు అందాన్ని పల్లె వేలుగు

  • మాకేదీ మహాలక్ష్మి
  • పలు గ్రామాలకు బస్సు లేక ప్రజల ఇబ్బందులు.
  • పట్టించుకొని ఆర్టీసీ అధికారులు

గొల్లపల్లి, ముద్ర విలేకరి : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతిష్టాత్మకంగా ఉచిత ప్రయాణం చేపట్టింది.కానీ జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల పరిధిలోని కొన్ని గ్రామాలకు మల్లన్న పేట, అగ్గిమల్ల, నందిపల్లి, అబ్బాపూర్, శంకర్ రావు పేట,గ్రామాల ప్రజలకు పల్లె వెలుగు’ బస్ సేవలు అందడం లేదాని గ్రామాలకు రహదారి సౌకర్యం ఉన్నా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపకపోవడంతో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.బస్ సౌకర్యం లేకపోవడంతో కళాశాలలకు, పాఠశాలల సమయానికి రాలేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు.దీంతో ప్రజలు, విద్యార్థులు ఆటోలలో ప్రయాణం చేస్తూ ఇబ్బందిపడుతున్నారు.బస్సులు నడపాలని అధికారులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎన్నో సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా ‘పల్లెవెలుగు’ బస్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ రహదారి పై బస్సులు నడిపితే వారి వారి గమ్య స్థలకు గ్రామాల ప్రజలకు ప్రయాణం సులువుగా అవుతోందాని చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించ్చినా అది అందని ద్రాక్షలా ఉందాని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి పలు గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.