Take a fresh look at your lifestyle.

లేబర్ టెండర్లలో అధికారుల జాప్యం

  • నేలలు గడుస్తున్న ఓపెన్ చేయని వైనం.
  • పుర అభివృద్ధికి అడ్డు పడుతున్నదెవరు..?

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒప్పంద పద్ధతిన నిర్వహించే లేబర్ టెండర్లలో అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.టెండర్ గత ఏడాది డిసెంబర్లో ముగియడంతో కొత్త ఆన్లైన్ లేబర్ టెండర్ కొరకు అవకాశం కల్పించారు.టెండర్ వేసి నెలలు గడుస్తున్న అధికారులు ఓపెన్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కాంట్రాక్ట్ పద్ధతిన ఆన్లైన్ టెండర్ల ద్వారా రెండు,మూడు,ఆరు నెలల పాటు టెండర్లను కేటాయిస్తూ పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.కాంట్రాక్టర్ టెండర్లో వేసిన పర్సంటేజీ (లెస్) ఆధారంగా వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. అయితే కొంత మంది కాంట్రాక్టర్ల ఒత్తిడితో అధికారులు ఆలస్యం చేయడం పట్ల పలువురు తప్పు పడుతున్నారు.నెలలు గడుస్తున్న టెండర్లను ఓపెన్ చేయకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేసే కార్మికులకు ఉపాధి దొరకగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య పనుల పురోగతిపై దృష్టి పెట్టాలని పుర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.కాగా ఇదే విషయంపై మున్సిపల్ ఏఈ అచ్యుత్ ను ‘ముద్ర’ వివరణ కోరగా వారం రోజుల్లో ఆన్లైన్ టెండర్ ఓపెన్ చేసి సంబంధింత పనులను చేయిస్తామని చెప్పారు.

  • పుర అభివృద్ధికి అడ్డు పడుతున్నదెవరు..?

పురపాలిక పరిధిలోని వార్డులలో వివిధ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కొందరు లీడర్లు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.వార్డుల్లో జరిగే పనుల విషయంలో నేతలు అధికారులపై ఒత్తిడి తేవడం పట్ల కొందరు మాజీ వార్డు కౌన్సిలర్లు ఆ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.వార్డు ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులకు లీడర్లు అందరు సహకరించాలంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.