Take a fresh look at your lifestyle.

ఉత్తమ్ నిస్వార్ధ ప్రజా సేవకుడు

  • ప్రశంసించిన రాహుల్ గాంధీ.

బోస్టన్, యూఎస్ఏ.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సన్న బియ్యంతో అన్నం తింటూ సంతోషంగా ఉన్నారని, ఈ ఏడాది విషయంలో రాష్ట్ర పౌరసపరాలు, నీటిపారుదల శాఖ మంత్రి హుజూర్ నగర్ శాసనసభ్యులు నలమాల ఉత్తంకుమార్ రెడ్డి చేసిన కృషి, తీసుకున్న చొరవ వల్లనే ఇదంతా సాధ్యమైందని ఉత్తమన్న యువసేన రథసారథి చలసాని రాజీవ్ చెప్పారు.అమెరికాలోని బోస్టన్ నగరంలో మంగళవారం ఏ ఐ సి సి అగ్ర నాయకులు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘన స్వాగతం పలికి తదుపరి జరిగిన సమావేశంలో కలిసి పలు విషయాలను రాజీవ్ వివరించారు. ఒక నిస్వార్థ నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలనే తపనతో ఉత్తంకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని రాజీవ్ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు.ఉత్తమ్ యువసేన తరఫున తాము పలు రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆపదలో ఉన్న వారిని, పేదలను ఆదుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆరోగ్యం కోసం పలు రకాలుగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చిన తాము స్పందిస్తున్నామని ఫోటోలు,వీడియోలతో సహా రాహుల్ గాంధీకి వివరించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రతిస్పందిస్తూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఒక నిస్వార్ధ ప్రజా సేవకుడని, మంచి రాజనీతిజ్ఞత కలిగిన మేధావి అని రాహుల్ గాంధీ ప్రశంసించారు.ఉత్తంకుమార్ రెడ్డి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అని, ఉత్తంకుమార్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని రాహుల్ గాంధీ చెప్పారు.రాహుల్ గాంధీ అమెరికా వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఉత్తమన్న యువసేన రథసారథి చలసాని రాజీవ్, ఆయన మిత్రులు స్పందిస్తూ పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని రాహుల్ గాంధీ ప్రశంసించారు.అంతేకాకుండా తన నాన్న పేరు అయినా రాజీవ్ పేరును పెట్టుకుని సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ తరఫున మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టాలని రాహుల్ గాంధీ ఉత్తమ్ అన్న యువసేన రథసారథి చలసాని రాజీవ్ ను అభినందించి ఆశీస్సులు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.