Take a fresh look at your lifestyle.

ఈత వనం దగ్దం పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్….

 

ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారీపేట గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్లు ఈత చెట్లు నిప్పు అంటుకొని దగ్దం అవగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం వారిని ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలో జరగడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఘటనకు స్పందించిన విప్ బోర్ మోటర్, పైపు లైన్ మంజూరు చేశారు. విప్ వెంట మండలాధ్యక్షులు కాయితీ నాగరాజు, నాయకులు పులి హరిప్రసాద్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.