Take a fresh look at your lifestyle.

దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

దళిత ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ తో కలిసి వారి చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు పెన్షన్ వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. సామాన్య ప్రజల అభ్యున్నతే ఆయన రాజకీయ లక్ష్యమని అన్నారు.దామోదరం సంజీవయ్య సామాన్య ప్రజల కోసం నిరంతరం పని చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.సామాజిక న్యాయం, సమానత్వం కోసం సంజీవయ్య చేసిన సేవలను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో దండు మైసమ్మ దేవాలయ చైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి, కౌన్సిలర్ నాగుల వాసు, జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, రెబల్ శ్రీనివాస్,గడ్డం వెంకన్న, గాజుల రాంబాయమ్మ. ఆలేటి మాణిక్యం, ఏలగబోయిన మధు, మద్యబోయిన శ్రీనివాస్, సాజిద్(నీడ్స్ ), బైరు వెంకన్న గౌడ్, గుణగంటి సతీష్, కోల నాగరాజు, కోడి శివ, రషీద్, సత్యం, సాయి, మధు యాదవ్, పిడమర్తి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.