ముద్ర కూకట్‌పల్లి:
భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం, ధర్మం, మరియు చివరి వ్యక్తి సంక్షేమమే లక్ష్యంగా పుట్టిన బీజేపీ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని కొనియాడారు. సేవ, సిద్ధాంతం, అభివృద్ధి, జాతీయత అనే నాలుగు స్తంభాలపై పార్టీ ప్రయాణం సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను సామాన్యులకు చేరువ చేస్తూ, ప్రజల పక్షాన నిలబడి మరింత బలంగా పనిచేయాలని రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
End