- అడిషనల్ డీసీపీ వెంకటరమణ.
- సందడిగా లైన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ గ్రీన్ సిటీ ప్రమాణ స్వీకారోత్సవం.
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ మల్కాజ్గిరి అడిషనల్ డిసిపి వెంకటరమణ పేర్కొన్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీ శ్రీ విజయ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయ సమీపంలోని శ్రీ విద్యారణ్య సదన్ లో ఏర్పాటుచేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ గ్రీన్ సిటీ 2025- 26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ లు మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా లయన్ వడ్లోజు జ్యోతిర్మయ చారి, ప్రధాన కార్యదర్శిగా విష్ణు సాయి ప్రసాద్, కోశాధికారిగా మేకల యాదగిరిలను ఇన్స్టాలేషన్ అధికారిగా లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320సి మొదటి డిస్టిక్ గవర్నర్ కల్యం కృష్ణారెడ్డి సభ్యులతో ప్రమాణం చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన శ్రేయస్సును వదిలేసి దేశ స్వాతంత్రానికి కృషి చేసిన కరంచంద్ గాంధీ చేసిన సేవలకు గాను మహాత్ముడయ్యాడని, రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తులు తన సంపాదనను సమాజ శ్రేయస్సుకు వెచ్చించి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇలాంటి వారి స్ఫూర్తితోనే లయన్స్ క్లబ్ లు సేవలను మరింత విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ అధ్యక్షురాలు లయన్ రమాదేవి బాధ్యతలను నూతన అధ్యక్షుడు లయన్ జ్యోతిర్మయాచారి కి ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. మానవ జన్మ సార్ధకత విలువల గురించి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు లయన్ వడ్లోజు జ్యోతిర్మయా చారి పద్య రూపేన వివరించారు. సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ మండా సురేష్ అతిధులను సన్మానించడంతోపాటు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్ సి సుజాత, లైనింగ్ గైడ్ విజయ్ కుమార్, హనుమంతరావు, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ రవికుమార్, మాస్టర్ శర్మని లయన్ శ్రీనివాస్ రెడ్డి కేసరి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్స్ లైన్ కలకొండ బిక్షపతి చారి, మిట్టపల్లి విజయ్ గౌడ్, సీనియర్ డిస్టిక్ లైన్స్ లైన్ నాగన్న, లయన్ మునిరత్నం మాణిక్యరెడ్డి, శ్రీదేవి,రమాదేవి, శేఖర్ రెడ్డి, సునీల్ చారి, కలకొండ మధుసూదన్, పెంటయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.