గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖ్ ఇసంపెల్లి వెంకన్న శనివారం పర్యటించిన్నారు.ఈ సందర్భంగా స్థానిక రామాలయంలో వారు మాట్లాడుతూ, మాత, భూమాత, గోమాత, కలిసిందే వందేమాతరం అని, మన భారతదేశం 80% వ్యవసాయ ఆధారిత దేశం, గోవు గోసంతతి అయిన ఎద్దులు లేకుండా వ్యవసాయం లేదని,వారు తెలిపారు. ఆవుపేడతో ఎరువులు కీటక నియంత్రణలు తయారు చేసి అమృతతుల్యమైన పంటలు పండించేవారని. గోమాత 33 కోట్ల దేవతలకు నిలయంగా ఉంటుందని వారు వివరించారు, రాబోవు పండుగలలో వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్, కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులలో, దేవీ నవరాత్రులలో, గోపాష్టమి రోజున ముందుగా గోపూజ చేయాలని వారు కోరారు. ప్రజలు మంచి ఆహారము, ఐశ్వర్యము, ఆరోగ్యం, ఉండాలంటే మనం గోవుని పూజించడం ఎంతో ముఖ్యమని, గోమాత రక్షణలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలుపంచుకోవాలని గోశాల నిర్మాణాలు గోగ్రాసము ధన సహాయము, గోదారిత వ్యవసాయం ప్రోత్సహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గోరక్ష ప్రముఖ్ ఆడెపు నరేష్, జిల్లా గోరక్ష సహా ప్రముఖ్ ఆముద సంతోష్, జిల్లా గోరక్ష విజ్ఞాన ప్రముఖ్ సమనపెల్లి శ్రవణ్ , జిల్లా గో ప్రశిక్షణ ప్రముఖ్ గొల్ల శ్రీకాంత్. ప్రఖండ అధ్యక్షులు శాతాల లక్ష్మణ్, గోభక్త చెవుల మద్ది రవిన్, ఇతరులు పాల్గొన్నారు.