Take a fresh look at your lifestyle.

కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం

  • ఎనిమిది మంది దళారులను గుర్తించిన పోలీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది కిడ్నీ దళారులను పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలలుగా అలకనంద ఆసుపత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్లుగా దర్యాప్తులో పోలీసులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన వైద్యుడు ఈ వ్యవహారంలో కీలంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి నిర్వహకుడు సుమంత్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.