Take a fresh look at your lifestyle.

అచ్చేదిన్ సంపన్నులకే మాత్రమే సామాన్య ప్రజలకు బారాలు మోపడమే -సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు లాభాలు ఆర్జించే బడ్జెట్ గా ఉంది తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగపడే విధంగా లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవనంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజలపై భారాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రతిపాదించిన బడ్జెట్ 53 లక్షల 47 వేల 315 కోట్ల బడ్జెట్ కేటాయింపులు సామాన్యులకు నష్టం చేసే సంస్కరణలకు మరల కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేసే విధంగా ఉందే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని వారు అన్నారు.కేంద్రం ప్రయోగిత పథకాలకు సబ్సిడీ తగ్గింపు స్పష్టంగా కనబడుతుందని కార్పోరేట్ కంపెనీలకు ఉపయోగపడే ప్రతి పానలు నిండుగా ఉన్నాయన్నారు. వికసిత్ భారత్ బ్యాంకింగ్ కోసం బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కొనసాగించడం అంటే బ్యాంకులను విలీనం చేసే ప్రకటికన్నా కొనసాగించడమే విదేశీ స్వదేశీ లాభాదాయలకు కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి కనీసం ప్రత్యామ్నాయ పన్నును 15 నుండి 14 శాతానికి తగ్గించినట్లు ఉందన్నారు. సంపన్నులు వాడుకునే విదేశీ సరుకులపై దిగుమతి పన్ను తగ్గించారు. మరొకపక్క ప్రజలపై వేసే వారాలు కొనసాగిస్తున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మీద వేసే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీలో 2024 -25 నుండి 2026 -27 వరకు స్థిరమైన పెరుగుదల కొనసాగిస్తూ ఉన్నారు మొత్తం ఖర్చులో ఆరోగ్యం వాటా 1.9% ఉంది 2020లో రెండో శాతానికి పెంచుతున్నామని మోడీ వాగ్దానం గాల్లో కలిసిపోయిందన్నారు.విద్యా రంగానికి మూడు శాతం లోపే ఉంది గ్రామీణ ఉపాధి హామీ పనిలో పని సంఖ్య 2021- 22 లో 384 కోట్ల నుండి 2025- 2026 లో 183.77 కోట్లకు పడిపోయింది మొత్తం రాబడిలో కార్పొరేట్ కంపెనీలకు కట్టే పన్నుల వాటా 18 శాతం మాత్రమే ఉండగా అత్యధిక మధ్యతరగతి కట్టే ఆదాయపన్నుబాట దానికంటే ఎక్కువ 21 శాతం ఉంది స్కీం వర్కర్లకు 2018 నుండి కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచడం లేదన్నారు.ఉద్యోగుల ప్రస్తావన బడ్జెట్లో లేదు ఉన్న ఉద్యోగాలకి గ్యారెంటీ లేకుండా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ఇది కార్పొరేటు సంపన్నులకే అచ్చేదిన్ బడ్జెట్ గా ఉందే తప్ప సామాన్యులకు ఏమాత్రము ఉపయోగపడే బడ్జెట్ కాదని అన్నారు. కార్మిక వర్గం బడ్జెట్లో మన వాటా కోసం పోరాటాలు కొనసాగించాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి సందబోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి జిల్లా కోశాధికారి జి భాస్కర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగర వెంకట్ మావో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి జాలీగాపు శిరీష సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి ఎం పద్మ అమ్ముల బాల నర్సయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు చొప్పరి రవికుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.