Take a fresh look at your lifestyle.

ఘనంగా హర్కర వేణుగోపాల్ రావు జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: హార్కరా వేణుగోపాల్ రావు ప్రియా శిస్యుడు రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం హార్కరా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం రైల్వే స్టేషన్ సమీపం లోని తబిత బాలల సంరక్షణ సంస్థ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హార్కరా వేణుగోపాల్ రావు జన్మదినం సందర్బంగా కేకు కట్ చేసి అన్నదానం నిర్వహించి,పండ్లు పంపిణి చేశారు. అమ్మపరివార్ స్వంచందా సేవ సంస్థ,గోదావరిఖని వారి ఆధ్వర్యంలో ఎంతోమంది నిరుపేదలకు, వృద్దులకు, వికలాంగులకు, అనాధలకు అన్నదానం నిర్వహించారు.గోదావరిఖని, రామగుండం లో గల పిల్లల సంరక్షణ కేంద్రంలో అన్నదానం పండ్ల పంపిణీ, నోట్ బుక్స్ పంపిణి చేసారు.అలాగే కిడ్నీ డయాలసిస్ ఉన్న నిరుపేద రోగులకు తనవంతు సాయంగా పాకెట్ మనీ అందచేసారు. విద్యార్ధి, విద్యార్ధినులు, ఆనాధలు, నిరుపేదలు, వికలాంగులు, హార్కర వేణుగోపాల్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియదేస్తూ కార్యక్రమం నిర్వహించిన వాజీద్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ రామగుండం మండల అధ్యక్షులు అర్కూటీ రాయమల్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నామాల కుమారస్వామి, అరుమూళ్ళ సదానందం, జావీద్ ఖాన్, సల్మాన్, రియాజ్, నాయబ్, అస్లాం, ఖలీమ్ గౌస్, జలీల్, నరేష్, సాగర్, సతీష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.